తమిళనాడు అన్నాడీఎంకేలో చీలికలు..

తమిళనాడులో TVK ప్రభుత్వ బల నిరూపణకు రేపటితో ముగియనున్న గడువు

Advertisements

<p>తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి&period; ఇటీవలి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం విజయ్ నేతృత్వంలోని TVK కూటమికి అనూహ్య మద్దతు లభించింది&period; అన్నాడీఎంకేలోని సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం తమ మద్దతును ప్రకటించింది&period; ఈ పరిణామంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతమైంది&period; త్వరలోనే ముఖ్యమంత్రి విజయ్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు షణ్ముగం&period;<br &sol;>&NewLine;గత దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే ఎదుర్కొంటున్న వరుస ఓటములే తమ నిర్ణయానికి కారణమని షణ్ముగం వివరించారు&period; దశాబ్దాలుగా బద్ధ శత్రువుగా ఉన్న డీఎంకే చేతిలో మూడుసార్లు&comma; గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీవీకే చేతిలో ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు&period; &&num;8220&semi;పార్టీని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని&period;&period; దాని భవిష్యత్తు గురించి చర్చించాలన్నారు&period; టీవీకేను అధికారంలోకి రాకుండా ఆపేందుకు&comma; డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధినేత&comma; మాజీ సీఎం పళనిస్వామి చేసిన ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకించామని షణ్ముగం స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>53 ఏళ్లుగా మన రాజకీయాలు డీఎంకేకు విరుద్ధంగానే సాగాయన్న షణ్ముగం&period;&period;డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనను మెజారిటీ వర్గం తిరస్కరించిందన్నారు&period; ఒకవేళ అలాంటి పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడే ఉండేది కాదని ఆయన స్ప‌ష్టం చేశారు&period; అయితే&comma; అన్నాడీఎంకేను చీల్చే ఉద్దేశం తనకు లేదన్న షణ్ముగం&period;&period;పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు&period; అందుకే ఎన్నికల్లో గెలిచిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు&period; ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది&period; మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది&period; కాంగ్రెస్ 5 సీట్లతో మద్దతివ్వగా&comma; రెండు వామపక్ష పార్టీలు &lpar;4&rpar;&comma; వీసీకే &lpar;2&rpar; మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది&period; అయితే&comma; ఈ పార్టీలన్నీ డీఎంకేకు దీర్ఘకాల మిత్రపక్షాలు కావడంతో ప్రభుత్వ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది&period; తాజాగా షణ్ముగం వర్గం మద్దతుతో విజయ్ సర్కారుకు రాజకీయంగా మరింత స్థిరత్వం లభించినట్లయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..

స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల…

ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ గా రాబోతున్న హీరో విజయ్ దేవరకొండ…