విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..

విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు

Advertisements

<p>తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది&period; గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ&period;&period; తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది&period; ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ&comma; ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ విజయ్ సర్కార్ సభలో తన మెజారిటీని నిరూపించుకుంది&period; దీంతో తమిళనాడులో దళపతి మార్క్ పూర్తి స్థాయి పాలనకు లైన్ క్లియర్ అయింది&period;<&sol;p>&NewLine;<p>ఓటింగ్‌కు ముందే డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు&period; దీంతో సభలో హాజరైన సభ్యుల సంఖ్య తగ్గిపోయి&period;&period; మెజారిటీ మార్క్ 88 కి పడిపోయింది&period; ఇది విజయ్ ప్రభుత్వానికి నల్లేరుపై నడకలా మారింది&period; ఇక మాజీ సీఎం పళనిస్వామి TVK ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసినప్పటికీ&period;&period; ఎస్&period;పి&period; వేలుమణి&comma; సి&period;వి&period; షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు&period; డీఎంకే వాకౌట్ చేయడం&comma; AIADMK తిరుగుబాటు వర్గం మద్దతు ఇవ్వడంతో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం చాలా సులభంగా ఈ బలపరీక్షలో నెగ్గింది&period;<&sol;p>&NewLine;<p>విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత స్పీకర్ జె&period;సి&period;à°¡à°¿&period; ప్రభాకర్ అధికారికంగా విజయ్ ప్రభుత్వం నెగ్గినట్లు ప్రకటించారు&period; ఈ విజయంతో అసెంబ్లీ వెలుపల టీవీకే శ్రేణులు&comma; విజయ్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు&period; సరిగ్గా మూడు రోజుల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూనే&period;&period; 200 యూనిట్ల ఉచిత విద్యుత్&comma; మహిళా భద్రత ఫైళ్ళపై సంతకం చేసిన విజయ్&period;&period; ఇప్పుడు అసెంబ్లీలోనూ తన బలాన్ని నిరూపించుకుని ప్రజా ప్రభుత్వంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>విశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత సీఎం దళపతి విజయ్ సభలో సమాధానమిచ్చారు&period; తమ ప్రభుత్వం ఖచ్చితంగా సెక్యులర్ ప్రభుత్వంగా ఉంటుందని అన్నారు&period; తమ ప్రభుత్వం గుర్రపు వేగంతో దూసుకుపోతుంది కానీ&period;&period; గుర్రం వ్యాపారానికి పాల్పడదు అంటూ ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు&period; గత ప్రభుత్వాల మంచి పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..