తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisements

<p>తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది&period; సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రి à°¡à°¿&period;శ్రీధర్ బాబు డిజిటల్ కేబినెట్ సమావేశాల సన్నాహకాల్లో భాగంగా ప్రత్యేక టాబ్ లను సీఎం&comma; డిప్యూటీ సీఎం&comma; మంత్రులకు అందచేశారు&period; డిజిటల్ కేబినెట్ అమలు తీరుతెన్నులను ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు&period;<br &sol;>&NewLine;డిజిటల్ కేబినెట్ విధానం అమలుకు రూ&period;2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించారు&period; ఈ ప్రాజెక్టు ప్రారంభానికి తొలివిడ‌à°¤‌గా రూ&period;20 à°²‌క్షల నిధుల విడుద‌à°²‌కు సైతం అనుమ‌తిచ్చింది&period; ప్రస్తుతం ఉత్తారాఖండ్‌లో డిజటల్ కేబినెట్ విధానం అమ‌లులో ఉంది&period; ఆ రాష్ట్రం అమలు చేస్తున్న సొల్యూష‌న్స్‌ను తెలంగాణ అవ‌à°¸‌రాల‌కు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు&period; ఇందుకోసం నేష‌à°¨‌ల్ ఇన్‌à°«‌ర్మేటిక్ సెంట‌ర్ à°¸‌ర్వీసెస్ ఇన్ కార్పొరేటెడ్‌తో ప్రభుత్వం చ‌ర్చలు జ‌రిపింది&period; అంతేకాకుండా ఈ క్యాబినెట్ అమ‌లుకు టీడీటీఎస్‌ను నోడ‌ల్ ఎజెన్సీగా ప్రభుత్వం నియ‌మించింది&period; à°ª‌రిపాల‌à°¨‌లో వేగం&comma; పార‌à°¦‌ర్శక‌à°¤ పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ కేబినెట్ విధానంలో సీఎం&comma; డిప్యూటీ సీఎం&comma; మంత్రులకు ట్యాబ్‌లు&comma; కంప్యూట‌ర్ల ద్వారా ఎజెండాలు&comma; ఫైల్స్ వీక్షణ అవకాశం ఉంటుంది&period; కేబినెట్ నోట్స్&comma; ప్రతిపాద‌à°¨‌లు&comma; నిర్ణయాలు పూర్తిగా డిజిట‌ల్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి&period; సమాచారం లీక్ అవ్వకుండా&comma; సాఫ్ట్ వేర్ హ్యాక్ అవ్వకుండా ప్రత్యేక లాగిన్ ఐడీ&comma; పాస్ à°µ‌ర్డ్స్‌‌తో సెక్యురిటీ చర్యలు అమలు చేస్తారు&period; ఈ కేబినెట్ విధానంలో ఎక్కడ నుండి అయినా&period;&period; ఎప్పుడైనా కేబినెట్ ఎజెండాల‌ను మంత్రులు à°ª‌రిశీలించే సౌక‌ర్యం ఉంటుంది&period; దీంతో à°¸‌మావేశాల‌కు ముందు&comma; à°¤‌à°°‌వాత ఫైళ్ల నిర్వహ‌à°£ సుల‌à°­‌à°¤‌రం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.