ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.

ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

Advertisements

<p>ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు&period; వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు&comma; మేడారం అభివృద్ధి పనులు&comma; సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు&period;ఈ సమావేశంలో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు&comma; త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు&period;మేడారం అభివృద్ధి పనులు&comma; పెండింగ్‌లో ఉన్న పనులను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు&period;త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం&comma; ములుగు జిల్లాల్లో పర్యటించి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నారు&period; అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు&period; 6 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారని&comma; ఎర్రిఘట్టమ్మ సమీపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు&period;అదే విధంగా ములుగు కలెక్టరేట్ నూతన భవనం&comma; మెడికల్ కాలేజ్&comma; నర్సింగ్ కాలేజ్&comma; కేంద్ర విద్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు&comma; ప్రారంభోత్సవాలు జరగనున్నట్లు మంత్రి తెలిపారు&period;ముఖ్యమంత్రి పర్యటన తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.