మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల విస్తరణ.

Advertisements

<p>మేడ్చల్ జిల్లా&comma; పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఒకేరోజు 100 సీసీటీవీ కెమెరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రారంభించారు&period; ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి సీసీటీవీ వ్యవస్థను పరిశీలించారు&period;ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానbని పేర్కొన్నారు&period; నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని&comma; ప్రజలు తమ ఇళ్లు&comma; కాలనీలు&comma; వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు&period; మీ సురక్ష – నేను సైతం 2&period;0&&num;8243&semi; కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 3 వేల సీసీటీవీ కెమెరాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు&period; ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో మొత్తం 2 లక్షల 45 వేల 35 సీసీటీవీ కెమెరాలు ఉండగా&comma; ఈ ఏడాదిలోనే మరో 16 వేల 339 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు&period; సీసీటీవీ కెమెరాల సహాయంతో ఈ ఏడాది 214 కేసులను ఛేదించగలిగామని సీపీ తెలిపారు&period; అలాగే లండన్ తరహాలో డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థను ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించామని&comma; త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ విధానాన్ని విస్తరిస్తామని వెల్లడించారు&period; ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపడతామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.