హుజూరాబాద్‌లో 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఖాళీగానే.

Advertisements

<p>సొంతింటి కలతో ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే మిగులుతోంది&period; కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పదేళ్ల క్రితం నిర్మించిన 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదు&period; సర్వేలు&comma; విచారణలు కొనసాగుతున్నా&&num;8230&semi; పంపిణీ మాత్రం ముందుకు సాగడం లేదు&period; పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో 2015-16లో హుజూరాబాద్ పట్టణంలోని గణేష్‌నగర్‌లో 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారు&period; ఇళ్లు పూర్తయినా&&num;8230&semi; ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ కేటాయింపు జరగకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది&period;<&sol;p>&NewLine;<p>2021 హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించారు&period; అయితే ఆ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది&period; అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన వార్డు సభల్లో మరోసారి దరఖాస్తులు స్వీకరించగా&&num;8230&semi; 2&comma;450 మందికి పైగా అర్హులు దరఖాస్తు చేసుకున్నారు&period; క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 450 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు&period; తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో&&num;8230&semi; అర్హత లేని వారికి కూడా ఇళ్లు కేటాయించారనే ఫిర్యాదులు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది&period; దీంతో జిల్లా కలెక్టర్ మరోసారి సమగ్ర విచారణకు ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>విచారణ ప్రారంభమై నెల రోజులు దాటినా&&num;8230&semi; ఇళ్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; రెవెన్యూ శాఖ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు కేటాయింపులు చేపడతామని అధికారులు చెబుతున్నారు&period; ఇదిలా ఉండగా&&num;8230&semi; ఇన్నాళ్లు ఖాళీగా ఉండటంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి దయనీయంగా మారింది&period; పలుచోట్ల కిటికీలు&comma; తలుపులు&comma; విద్యుత్ మీటర్లు చోరీకి గురయ్యాయి&period; డ్రైనేజీ&comma; తాగునీటి వంటి కనీస మౌలిక వసతులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు&period;<&sol;p>&NewLine;<p>పదేళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నామని&&num;8230&semi; ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; వెంటనే ఇళ్లకు మరమ్మతులు చేసి&comma; మౌలిక వసతులు కల్పించి అర్హులకు కేటాయించాలని కోరుతున్నారు&period; నిర్మాణం పూర్తై దశాబ్దం గడిచినా&&num;8230&semi; డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అందకపోవడం హుజూరాబాద్‌లో చర్చనీయాంశమైంది&period; విచారణను త్వరగా పూర్తి చేసి&&num;8230&semi; ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.