విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

Advertisements

<p>à°«à°¿à°«à°¾ వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా&comma; ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు&period;హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు&period; మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యార్థుల కేరింతలు&comma; చప్పట్లతో వేదిక సందడిగా మారింది&period;ఇటీవల ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్రంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి మరింత పెరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక వీక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది&period;అట్లాంటాలో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌పై విజయం సాధించింది&period; చివరి నిమిషం వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగడంతో విద్యార్థులు ఉత్సాహంగా మ్యాచ్‌ను ఆస్వాదించారు&period;గత డిసెంబర్‌లో మెస్సీ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించి&comma; యువతలో క్రీడాస్ఫూర్తిని నింపిన విషయం తెలిసిందే&period; అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి క్రీడా అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.