కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుంచి సాగునీరు విడుదల.

Advertisements

<p>మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుంచి సాగునీరు విడుదలైంది&period; సాగునీటిని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు&period; ప్రస్తుతం కోయిల్ సాగర్ రిజర్వాయర్లో 0&period;9 టీఎంసీల నీరు అందుబాటు లో ఉందని ఎమ్మెల్యే తెలిపారు&period; ఇందులో తాగునీరు అవసరాలకు 0&period;6 టీఎంసీల నీటిని కేటాయించాల్సి ఉంటుందన్నారు&period; ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు&period; ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపడంతో పాటు&comma; బోర్లు రీఛార్జ్ అయ్యేలా తొలి విడతగా కాల్వల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు&period; ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరుతడి పంటల వైపే రైతులు మొగ్గు చూపాలని జిఎంఆర్ రైతులకు ఎమ్మెల్యే సూచించారు&period; సాధారణంగా కాలువలకు నీటిని విడుదల చేయాలంటే కనీసం 1&period;5 టిఎంసిల నీరు ఉండాల్సిన అవసరం ఉందన్నారు&period; అయితే ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను దృష్టిలో రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కాల్వల ద్వారా సాగు విడుదల చేశామన్నారు&period; దీంతో&comma; రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.