నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో లబ్ధిదారుల ఆందోళన.

Advertisements

<p>జగిత్యాల జిల్లా నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో లబ్ధిదారుల ఆందోళనకు దిగారు&period; మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు&period; మంత్రి వస్తున్నారన్న కారణంతోనే హడావుడిగా రోడ్లు వేస్తున్నారని&period;&period; మిగిలిన రోజుల్లో తమను పట్టించుకునే వారు ఎవరూ లేరని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>కాలనీలో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆరోపిస్తున్నారు&period; డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు&period; రేషన్ బియ్యం కోసం జగిత్యాల వరకు వెళ్లి ఆటోల్లో తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; అత్యవసర సమయంలో వైద్యం కోసం ఆసుపత్రి సౌకర్యం లేదని&period;&period; పిల్లలకు కనీసం పాఠశాల సదుపాయం కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక కాలనీలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; మంత్రి పర్యటన నేపథ్యంలో నిన్న హడావుడిగా మట్టి రోడ్లు వేశారని ఆరోపిస్తూ&period;&period; తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వతంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.