నేడు తెలంగాణ అసెంబ్లీలో మూడో రోజు సమావేశాలు.

Advertisements

<p>తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజు కూడా రాజకీయ వేడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి&period; తొలి రెండు రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలు&comma; బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టుల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌&comma; ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది&period; స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల అంశం సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చే అవకాశముంది&period; తాతా మధు&comma; నవీన్‌ రెడ్డిలపై తీసుకున్న చర్యలు&comma; కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌పై బీఆర్‌ఎస్‌ స్పందించే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు సభలో మహిళా ఎమ్మెల్యేల గౌరవానికి సంబంధించిన అంశాన్ని బీఆర్‌ఎస్‌ లేవనెత్తే అవకాశం ఉంది&period; ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం పట్టుబట్టే అవకాశం ఉంది&period; అసెంబ్లీ బయట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలను అడ్డుకోవడం&comma; అరెస్టు చేయడంపై కూడా ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగే అవకాశం ఉంది&period; దీంతో సభ ప్రారంభం నుంచే అధికార&comma; ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం&comma; నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>రాజకీయ అంశాలతో పాటు ప్రజా సమస్యలపైనా బుధవారం సభలో చర్చ జరగనుంది&period; వరి సాగు&comma; ధాన్యం కొనుగోళ్లు&comma; రైతుల సమస్యలు&comma; కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు&comma; విచారణ పురోగతి వంటి అంశాలు చర్చకు రానున్నాయి&period; టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు&comma; రిటైర్డ్‌ ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు&comma; 22-ఏ భూముల వివాదాలు&comma; చేనేత కార్మికుల సంక్షేమం&comma; బీసీ మహిళల స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు&period; ప్రజా పాలనకు సంబంధించిన కొన్ని సవరణ బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో మూడో రోజు సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.

ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.

తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.