హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.

Advertisements

<p>హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది&period; భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది&period; సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు&period; 35కి పైగా దేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు&comma; రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు&comma; పరిశ్రమ నిపుణులు హాజరుకానున్నారు&period; &OpenCurlyQuote;ది డోర్ టు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్’ అనే థీమ్‌తో జరిగే ఈ సదస్సులో అంతర్జాతీయ పెట్టుబడులు&comma; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&comma; ప్రాప్‌టెక్&comma; డీప్‌టెక్&comma; సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌తో పాటు ప్రాప్‌టెక్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్నోవేషన్ షోకేస్&comma; లగ్జరీ ప్రాపర్టీ ఎక్స్‌పో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు&period; భారత రియల్ ఎస్టేట్ రంగం అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకుందని నిర్వాహకులు పేర్కొన్నారు&period; ప్రపంచ రియల్ ఎస్టేట్‌లో రానున్న మార్పులను భారత మార్కెట్‌తో అనుసంధానించడమే సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు&period; ఈ గ్లోబల్ ఈవెంట్‌తో హైదరాబాద్‌ ఖ్యాతి మరింత పెరగడంతో పాటు&comma; భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి కొత్త అంతర్జాతీయ పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.