ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

Advertisements

<p>తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు&period; న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి&comma; కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి&period;టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు&period; తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి అవుతుందని&comma; నాణ్యమైన బియ్యాన్ని పెద్ద మొత్తంలో సరఫరా చేసే సామర్థ్యం&comma; ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ రాష్ట్రానికి ఉందని వివరించారు&period; తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకునే ప్రతిపాదనపై ఫిలిప్పీన్స్ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు&period; మరింత పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>బియ్యం రకాలు&comma; ధరలు&comma; నాణ్యతా ప్రమాణాలు&comma; కొనుగోలు విధానం&comma; రవాణా&comma; ధ్రువీకరణతో పాటు శానిటరీ&comma; ఫైటోశానిటరీ నిబంధనలపై ఇరువురు చర్చించారు&period; ప్రభుత్వ సంస్థలు&comma; దిగుమతిదారులు&comma; ఎగుమతిదారులు&comma; రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు&period; పోటీ ధరలు&comma; నాణ్యత&comma; నిర్ణీత సమయంలో సరఫరా చేసే సామర్థ్యంతో తెలంగాణ దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామిగా నిలవగలదని ఉత్తమ్ పేర్కొన్నారు&period; డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శి లారెల్‌ను మంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.

వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.