తెలంగాణలో సెమీకండక్టర్‌ పరిశ్రమకు సింగపూర్‌ సిద్ధం

Advertisements

<p>తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్‌ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం తెలిపింది&period; అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన ప్రతినిధులు&period;&period; రాష్ట్రంలో పెట్టుబడులు&comma; అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు&period; మూసీ పునరుజ్జీవనం&comma; ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి ప్రణాళికలను సీఎం వారికి వివరించారు&period;<&sol;p>&NewLine;<p>మూసా&comma; ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్‌ వరకు తొలిదశలో మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు&period; రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధితో పాటు నైట్‌ ఎకానమీని ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు&period; హైదరాబాద్‌ను పర్యాటక నగరంగానే కాకుండా నాలెడ్జ్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని&period;&period; ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌à°² ఏర్పాటుకు అంగీకరించాయని వివరించారు&period;<&sol;p>&NewLine;<p>ఫ్యూచర్‌ సిటీని నెట్‌ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం వెల్లడించారు&period; తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించాలని సింగపూర్‌ ప్రతినిధులను కోరారు&period; పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు&period; డిసెంబరులో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సింగపూర్‌ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.