కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.

Advertisements

<p>తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కీలకంగా సమావేశం కానుంది&period; బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ మరోసారి చర్చించనుంది&period; అసెంబ్లీలో మార్చి నెలలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి&period; ఈ వ్యవహారంపై స్పీకర్‌ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయగా&period;&period; కమిటీ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది&period; తొలుత సెప్టెంబర్ 19à°¨ సమావేశం కావాల్సి ఉండగా&period;&period; కౌశిక్ రెడ్డి వివరణపై కమిటీ అసంతృప్తిగా ఉందన్న నేపథ్యంలో భేటీ వాయిదా పడింది&period; తాజాగా ఇవాళ కమిటీ సమావేశం కానుంది&period; పార్కల్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి ఇచ్చిన వివరణ&comma; ఆయనపై వచ్చిన ఆరోపణలు&comma; తదుపరి చర్యలపై చర్చించే అవకాశం ఉంది&period; కమిటీ ఏం సిఫార్సు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది&period; అయితే తుది నిర్ణయం కమిటీ చర్చ అనంతరం వెల్లడికానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు విచారణ.

గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.

ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.