తెలంగాణలో తీవ్రరూపం దాల్చిన ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం.

తెలంగాణలో తీవ్రరూపం దాల్చిన ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం

Advertisements

<p>తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది&period; ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం&period; 38 నిబంధనలను అధికారులు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన బాట పట్టింది&period; ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు విధులను బహిష్కరించి ఆకస్మిక సమ్మెకు దిగారు&period; బదిలీల్లో పారదర్శకత పాటించాలంటూ వైద్యుల సంఘం విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంఘం నేతలు స్పష్టం చేశారు&period; బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో 38లో పేర్కొన్న అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు&period; ఇప్పటికైనా మొండివైఖరి వీడి వెంటనే తమతో చర్చలు జరపాలని&comma; లేనిపక్షంలో రాబోయే రోజుల్లో అత్యవసర సేవలను కూడా నిలిపివేసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం.

హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు.