కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది.

Advertisements

<p>కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది&period; డీలిమిటేషన్ బిల్లు&comma; కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు యూటీ సవరణ బిల్లు&comma; మహిళా చట్టంలో మార్పు కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది&period; మహిళా చట్ట సవరణపై అధికార&comma; ప్రతిపక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినా&period;&period; డీలిమిటేషన్ విషయంలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వాదనలు జరిగాయి&period; నేడు లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్ జరగనుంది&period; లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందితే రాజ్యసభలో ప్రవేశపెట్టి శనివారం ఓటింగ్ జరుపుతారు&period; ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా&quest; అంత బలం అధికారపక్షానికి ఉన్నదా&quest; అనే చర్చ జరుగుతున్నది&period; రాజ్యాంగ సవరణ ఉండటంతో సభలో మూడింట రెండు వంతుల మంది ఎంపీలు మద్దతు ఇస్తేనే బిల్లు ఆమోదం పొందుతుంది&period; లోక్‌సభలో ఎన్డీయే&comma; ప్రతిపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం&period;<&sol;p>&NewLine;<p>రాజ్యాంగ సవరణకు 2&sol;3 మెజార్టీ అవసరం&period; ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది ఎంపీలున్నారు&period; ఎంపీలందరూ సభకు హాజరైతే బిల్లు ఆమోదానికి 360 మంది సభ్యుల మద్దతు అవసరం&period; ఎన్డీయేకు 293 మంది&&num;8230&semi; 240 మంది బీజేపీ ఎంపీలు&comma; 16 మంది టీడీపీ ఎంపీలు&comma; 12 మంది జేడీయూ ఎంపీలున్నారు&period; అంటే సభలో 54 శాతం బలమున్నది&period; ప్రతిపక్ష కూటమికి 233 మంది ఎంపీలున్నారు&period; అందులో కాంగ్రెస్‌కు 98 మంది ఎంపీలు&comma; సమాజ్‌వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు&comma; టీఎంసీకి 28 మంది ఎంపీలు&comma; డీఎంకేకు 22 మంది ఎంపీల బలమున్నది&period; అలాగే&comma; ఏడుగురు స్వతంత్ర ఎంపీలు&comma; ఎన్డీయే&comma; ఇండియా కూటములకు చెందని వైసీపీ&comma; ఎంఐఎం&comma; శిరోమణి వంటి పార్టీలకు ఏడుగురు సభ్యుల బలమున్నది&period;<&sol;p>&NewLine;<p>సభ్యులంతా సభకు హాజరైన పక్షంలో 360 మంది ఎంపీలు మద్దతిస్తే ఈ మహిళా కోటా&comma; డీలిమిటేషన్ బిల్లులు పాస్ అవుతాయి&period; ఎన్డీయేకున్న బలం 293&period; అంటే మరో 67 మంది సభ్యుల మద్దతు అవసరం&period; అంటే ఈ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి&period; ఓటింగ్‌లో పాల్గొనకున్నా&period;&period; క్రాస్ ఓటింగ్ జరిగినా&period;&period; సభకు గైర్హాజరైనా ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకు అనుగుణంగా తగ్గుతుంది&period; ఈ కోణంలో సమాజ్‌వాదీ &comma; తృణమూల్ కాంగ్రెస్ &comma; డీఎంకేల్లో ఏవేని రెండు పార్టీలు గైర్హాజరైతే బిల్లు ఆమోదం కేంద్రానికి సులువవుతుంది&period; ఒకవేళ 20 మంది ఎంపీలు గైర్హాజరైతే మ్యాజిక్ ఫిగర్ 360 నుంచి 347కు తగ్గుతుంది&period; రాజ్యసభలో రాజ్యాంగ సవరణ ఆమోదానికి 163 మంది ఎంపీల మద్దతు అవసరం&period; ఎన్డీయేకు 141 మంది బలముండగా&comma; ఇండియా కూటమికి 83 మంది ఎంపీల బలమున్నది&period; బీఆర్ఎస్&comma; వైసీపీ&comma; బీజేడీ&comma; బీఎస్పీ&comma; స్వతంత్ర ఎంపీలు 20 మంది ఉన్నారు&period; అంటే&comma; రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించుకోవచ్చు&period; కానీ&comma; లోక్‌సభలో ఆమోదం పొందితేనే బిల్లులు పెద్దల సభకు చేరుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.