60
ప్రకాశం జిల్లా.. మార్కాపురం లో ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో కాంపౌండర్ పైశాచిక నిర్వాకం… కాంపౌండర్ బొందిలి రామ్‌సింగ్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన మహిళల ఫోటోలు సెల్ ఫోన్ లో తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. డాక్టర్ వద్దకు అనారోగ్యంతో వచ్చే మహిళలకు ఇంజక్షన్లు వేసే సమయంలో రహస్యంగా సెల్ ఫోన్ లో అసభ్యకర చిత్రాలను తీస్తున్నాడు. నిన్న సాయంత్రం దోర్నాలకు చెందిన ఓ మహిళా పోలీసు తన తల్లిని డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లగా కాంపౌండర్ ఎప్పటిలాగే ఆమెను ఫోటో తీసేందుకు ప్రయత్నించగా గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలిసులు కేసు నమోదు చేసి కాంపౌండర్ సెల్ ఫోన్ పరిశీలించగా పదుల సంఖ్యలో ఉన్న మహిళల ఫోటోలు చూసి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అవాక్కైనారు.