మద్యం కుంభకోణం కేసు లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు సిసోడియాకు అవకాశం లభించింది. ఈ మేరకు సిటీ కోర్టు ఆయనకు ఆరు గంటల పాటు అనుమతినిచ్చింది. దీంతో ఆయన తన నివాసానికి చేరుకున్నారు. పోలీసు సిబ్బందితో కలిసి జైలు వ్యాన్‌లో మథుర రోడ్డులో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేశారు. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో అప్పటి నుంచి ఆయన తిహార్ జైల్లో ఉంటున్నారు. కాగా.. సిసోడియా జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య సీమా ఆరోగ్యం క్షీణించింది. గతంలోనూ ఢిల్లీ హైకోర్టు.. తన భార్యను చూసేందుకు అనుమతించినా.. ఆమెను సిసోడియా కలవలేకపోయారు. తాజాగా మరోసారి ఆయన తన సతీమణిని కలిసేందుకు సిటీ కోర్టు అనుమతించింది.
మనీశ్‌కు భార్యను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు..
60
previous post