186
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం మహిమాన్వితమైనది. చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలసిన గంగమ్మ ఆలయానికి నవంబర్ 8 వ తేదీ నుండి డిసెంబర్ 28 వ తేదీ వరకు వచ్చిన కానుకలను ఆలయ పాలక మండలి చైర్మన్, నాగరాజారెడ్డి, కార్యనిర్వాహక అధికారి చంద్రమౌళి వివరించారు. అమ్మవారికి 46 లక్షల 4 వేల 425 రూపాయల నగదు, 52 గ్రాముల బంగారం, 480 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించారని నాగరాజరెడ్డి, చంద్రమౌళి తెలిపారు.