65
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లి సమీపంలో గల 110 ఎకరాల భూమిని పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ కోసం ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించడంతో అప్రమత్తమైన గ్రామస్తులు పలమనేరు ఆర్డిఓ కార్యాలయంలో నిరసన తెలియజేశారు. శుక్రవారం ఈరోజు ఎలక్ట్రిక్ బస్సుల తయారీ బృందం స్థలాన్ని పరిశీలించుటకు వస్తున్న సందర్భంగా గోపిశెట్టిపల్లి రైతులను, గ్రామస్తులను బయటకు రాకుండా పోలీసులు చుట్టుముట్టారు. ఉన్న అర్ధఎకరా ఒక ఎకరా భూములను పోగొట్టుకుని మేము ఎలా జీవం కొనసాగించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్కడే పార్టీని నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండడంతో రైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
Read Also..