71
అల్లూరి సీత రామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పోల్లూరు గ్రామంలో సీలేరు నదిలో గుర్తుతెలియని సాధువు మృతి చెందారు. గత వారం రోజులుగా పోల్లూరు గ్రామం లో బిక్షాటన చేస్తున్న సాధువు, పోల్లూరు PES కంపెనీ వెనకాల గల వున్నా కాలువ దగ్గర మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతదేహాని గమనించిన గ్రామస్థులు మోతుగూడెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాని చింతూరు మార్చ్యురికి తరలించారు. సీలేరు నదిలో జపం చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.