దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిన శ్రీసిటీ గురించి కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం, ప్రశంసించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆమె గురువారం తిరుపతి సిజిఎస్టి కమిషనరేట్‌లోని జిఎస్టి భవన్‌కు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో తిరుపతి జీఎస్టీ కమిషనరేట్ ఆదాయం గణనీయంగా వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ఈ రాబడికి శ్రీసిటీలోని పలు రంగాల పరిశ్రమలు, మరియూ జిల్లాలోని ఇతర పరిశ్రమలు దోహదపడిందని ఆమె చెప్పారు. అభివృద్ధి చెందుతున్న శ్రీసిటీ పారిశ్రామిక కేంద్రంలో భవిష్యత్ వృద్ధికి మంచి అవకాశం ఉందని, తద్వారా దేశ జిడిపికి గణనీయంగా తోడ్పాటు అందిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. కచ్చితమైన గణాంకాలతో నిక్కచ్చిగా మాట్లాడే కేంద్ర ఆర్థిక మంత్రి నోట శ్రీసిటీ మాట రావడం, కితాబివ్వడం తమ కృషికి తగిన గుర్తింపుగా భావిస్తున్నట్లు శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు.
నిర్మలమ్మ నోట శ్రీసిటీ మాట
76
previous post