అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. 20 ఏళ్ల విద్యార్థిని బంధించి, తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు. దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
20 ఏళ్ల బాధిత యువకుడిపై సత్తారు వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్ లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఓ రెస్టారెంట్ లో బాధిత యువకుడు మరో వ్యక్తికి ఎంతో బాధగా కనిపించాడు. దీంతో, ఆ వ్యక్తి బాధిత యువకుడిని కలిసి ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో, ఈ ముగ్గురు తనను టార్చర్ చేస్తున్న విధానాన్ని వాట్సాప్ ద్వారా అతనికి తెలియజేశాడు. ఈ దారుణం గురించి తెలుసుకున్న ఆయన చలించిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఆ ముగ్గురు ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు లోపలకు వచ్చేందుకు ఆ ముగ్గురు నిరాకరించారు. పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన బాధితుడు వెంటనే వారి వద్దకు వచ్చి తన బాధలను చెప్పుకున్నాడు. తనను రక్షించాలని కోరాడు. అనంతరం ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా, హింసించడం తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
అమెరికాలో ముగ్గురు ఏపీ కిరాతకాలు
114
previous post