తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం.

Advertisements

<p>తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారింది&period; బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌&comma; తెలంగాణలో రాబోయే 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు&comma; మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది&period; కోస్తాంధ్ర&comma; యానాం ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది&period; కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>రాయలసీమలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ&period;&period; గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది&period; రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల వరకు&comma; కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది&period; తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై&period;&period; ఉరుములు&comma; మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది&period; గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్‌&comma; పరిసర ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది&period; నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీలు&comma; కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది&period; సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయి&period; బలమైన ఈదురుగాలులు&comma; ఉరుములు&comma; పిడుగులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్లు&comma; విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు&period; వాతావరణ పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.