93
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం ఆళకుప్పం గ్రామం నందు, అవినాష్ భార్య గీత (40) ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండగా, గమనించిన చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గంగవరం మండలం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని, గీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, పూర్తి వివరాలు తెలుపుతామన్నారు.