శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్ ఆదేశాల మేరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రసూతి ఆసుపత్రి విభాగాధిపతి డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తోటి విద్యార్థి, విద్యార్థులతో ఎయిడ్స్ గురించి అప్పుడప్పుడు చర్చించడం వలన ఎయిడ్స్ మీద ఉన్న అపోహలు సందేహాలను, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ఎయిడ్స్ పట్ల జాగ్రత్త వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రసూతి వైద్యశాల నందు గర్భిణీ స్త్రీలను పరీక్షించేటప్పుడు ఎయిడ్స్ పట్ల వాళ్లకి అవగాహన కల్పించి , వారికి ప్రాథమిక చికిత్స ఇవ్వడం జరుగుతుందని విద్యార్థులకు తెలిపారు. ఎయిడ్స్ పట్ల సందేహాలు ఏవైనా ఉంటే ప్రసూతి ఆసుపత్రి నందు కౌన్సిలర్లు , మరియు సోషల్ వర్కర్లు అందుబాటులో ఉంటున్నారని వారి యొక్క సేవలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలిపారు. ఎస్వీ వైద్య కళాశాల మైక్రో బయాలజీ విభాగము డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ హోమ్ సైన్స్ విద్యార్థులకు ఎయిడ్స్ పట్ల మైక్రో బయాలజీ ల్యాబ్ లో జరుగుతున్న టెస్టుల గురించి క్లుప్తంగా వివరించారు. వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో, వైరాలజీ ల్యాబ్ గురించి తదితరాంశాల గురించి వారికి వివరించారు. రుయా ఆసుపత్రిలోని ఏ ఆర్ టి సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ఆనంద్ రావు మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల భయభ్రాంతులకు కాకుండా యువత అన్ని విషయాలను ఎయిడ్స్ గురించి చర్చించుకోవడానికి ఏ ఆర్ టీ సెంటర్ నందు వైద్యులు, కౌన్సిలర్సు మరియు సోషల్ వర్కర్లు అందుబాటులో రుయా ఆసుపత్రి నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడానికి కౌన్సిలింగ్ చేయడానికి సూచనలు అందించడానికి అందుబాటులో ఉంటున్నారని విద్యార్థులను ఉద్దేశించి ఆయన అన్నారు. ఎయిడ్స్ వ్యాధి సోకిన వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఉచితంగా రూపాయలు 8,000 విలువ చేసే మందులను భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆసుపత్రి ఏ ఆర్టి, సెంటర్ అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అని అన్నారు. హోమ్ సైన్స్ విద్యార్థులు ఎయిడ్స్ పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దానికి కావలసిన సోషల్ ప్రివెంటివ్ మెజర్స్, సంబంధించిన పలు ప్రశ్నలు, పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ చెందిన విభాగాధిపతి డాక్టర్ వి.బిందు, ప్రొఫెసర్ ఎం.అరుణ, డాక్టర్ జి.శిరీష, డాక్టర్ అనిత, హోమ్ సైన్స్ విభాగం యు జి పీజీ విద్యార్థులు మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమం..
61
previous post