126
నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 17 ఎర్ర చందనం దుంగలు, కారు,రెండు బైకులు,తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తెలిపారు.ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ సూచనల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం చెట్లు నరికి,నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల అటవీ ప్రాంతంలో డంప్ చేసి అక్కడ నుంచి కారు లో రవాణా చేసేందుకు సిద్ధంచేయగా అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.