అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద పట్టుబడ్డ గంజాయి. వాహనాల చెకింగ్ లో గుర్తించిన పోలీసులు. అశోక్ లెలాండ్ కంటైనర్ బాక్స్ లో సీక్రెట్ అరా ఏర్పాటు. అందులో 305కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 30 లక్షలు ఉండొచ్చని అంచనా. గంజాయిని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు.
illegal transportation
టాటా మ్యాజిక్ వ్యాన్ తో పాటు నలుగురు వ్యక్తులు,ఐదుగురు మహిళలు అదుపులోకి తీసుకున్న వైనం. కిర్లంపూడి మండలం బూరుగుపూడి శివారు జాతీయ రహదారిపై పామాయిల్ తోట సమీపంలో గంజాయి తరలిస్తున్నారని సమాచారంతో..జగ్గంపేట.. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్య అప్పారావు.. సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు..లకు వచ్చిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేయగా టాటా మ్యాజిక్ లో గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బి సూర్య అప్పారావు తెలియజేశారు.
Read Also..
గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ సమయములో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మహేంద్ర కారును స్వాధీనం చేసుకుని అందులోని 77. 159 కేజీల గంజాయి ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంకు చెందిన సూహైల్ పాషా,ఇమ్రాన్ అహ్మద్ లను అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణాకు కారకుడైన బెంగళూరుకు చెందిన ముహమ్మద్ సూఫీయల్ అనే అతని పై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఈబి అధికారులు తెలియజేశారు.
నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 17 ఎర్ర చందనం దుంగలు, కారు,రెండు బైకులు,తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తెలిపారు.ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ సూచనల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం చెట్లు నరికి,నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల అటవీ ప్రాంతంలో డంప్ చేసి అక్కడ నుంచి కారు లో రవాణా చేసేందుకు సిద్ధంచేయగా అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.






Total views : 75159