145
విజయనగరంలో అడ్డగోలుగా బాణాసంచా విక్రయాలు జరుగుతున్నాయి. ఆర్గీఓ కార్యాలయం రోడ్డు, విశాఖ-రాయపూర్ హైవేను తమ అడ్డాగా వ్యాపారులు మార్చేసుకున్నారు. విక్రయదారులు కనీస నియమ నిబందనలు పాటించటం లేదు. కాసులకు కక్కుర్తిపడి ADFO అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. విజయనగరం RTO రోడ్డులో పెట్రోల్ బంక్ ప్రక్కనే బాణాసంచా విక్రయాలు జరుపుతున్నారు. వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, దుకాణాలకు మధ్యలో రెండడుగుల దూరం కూడా ఉండదు. కనీసం జిల్లా అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. క్యాష్ కొట్టు దుకాణం పెట్టు అనే తీరులో ADFO వ్యవహరిస్తోంది.