అన్నమయ్య జిల్లా పుంగనూరు మం. ఎంసీ పల్లిలో ఓ ఆత్మ కథ…

అన్నమయ్య జిల్లా పుంగనూరు మం. ఎంసీ పల్లిలో ఓ ఆత్మ కథ

Advertisements

<p>ఇది మరో ఆత్మ కథ &period;&period;సినిమాలో చూపిస్తున్నట్లు ఆత్మలు ఉన్నాయా &quest; ఉంటే ఎలా ఉంటాయి &quest; మరొకరిలోకి ప్రవేశిస్తుందా &quest; ప్రస్తుత ఏఐ యుగంలో ఆత్మలు అంటూ భ్రమపడితే నమ్మే వాళ్ళు ఉంటారా &quest; మూఢనమ్మకాలను ఇంకా నమ్మేదెవరు &quest; ఇలాంటి సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం ఎంసీపల్లి గ్రామంలో జరిగింది &period;ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది&period; ఆరు నెలల క్రితం తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని బాధతో 18 ఏళ్ల హేమ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే&period; అయితే తాజాగా అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై హేమ ఆత్మ ఆవహించిందని గ్రామస్తులు నమ్ముతున్నారు&period; బాలిక అసహజ ప్రవర్తనతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తుండగా&comma; ఆమె తల్లిదండ్రులు భూత వైద్యుడిని ఆశ్రయించారు&period; అంకాలమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాలికలో మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు&period; పూజల సమయంలో బాలిక ఒక్కసారిగా ఆగ్రహంతో ప్రవర్తిస్తూ అక్కడున్న వారిపై దూసుకెళ్లడం కలవరపరిచింది&period; ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సివిఆర్ రిపోర్టర్‌పై కూడా ఆమె దాడి చేయడం సంచలనంగా మారింది&period; ఇది నిజంగా ఆత్మ ఆవహించిందా లేక మానసిక సమస్యలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి&period; ఈ ఘటనపై స్థానికులు భయంతో పాటు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>పుంగనూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది&period; దింతో హేమ ఆత్మ గ్రామంలో తిరుగుతోందని ప్రచారం జోరందుకుంది&period; అదే సమయంలో ఒక మైనర్ బాలిక ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో గ్రామస్తులు దీనిని ఆత్మ ప్రభావంగా భావిస్తున్నారు&period; బాలిక తనలో మరో వ్యక్తి ఉన్నట్లు మాట్లాడడం&comma; ఆగ్రహావేశాలకు లోనవడం&comma; తనకు తెలియని విషయాలు చెప్పడం వంటి ఘటనలు బాలిక కుటుంబాన్ని ఆందోళనకు గురిచేశాయి&period; ఈ నేపథ్యంలో భూత వైద్యుడిని సంప్రదించగా&comma; అంకాలమ్మ పూజల సమయంలో బాలిక తీవ్రంగా ప్రతిస్పందించింది&period; అక్కడున్న వారిని బెదిరిస్తూ&comma; రిపోర్టర్‌పై దాడి చేయడం మరింత కలవరపరిచింది&period; అయితే నిపుణులు మాత్రం ఇలాంటి ఘటనలను మానసిక ఆరోగ్య సమస్యల కోణంలో చూడాలని సూచిస్తున్నారు&period; మూఢనమ్మకాలకంటే వైద్య చికిత్స అవసరమని అభిప్రాయపడుతున్నారు&period; సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా మూఢ నమ్మకాలను పాటించే జనం ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది &period; ఏదిఏమైనా ఈ ఘటన స్థానికంగా భయంతో పాటు ఆసక్తి నీ కూడా రేకెత్తిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..