అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు.

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు&period; చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని ఆదేశించారు&period; లేదంటే ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు&period; ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు&period; సరిగ్గా 48 గంటల్లోగా ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని తెరవాలని అల్టిమేటం జారీ చేశారు&period; ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని హెచ్చరించారు&period; దాన్ని పూర్తిగా తెరవకుంటే&period;&period;ఇరాన్‌లోని పలు విద్యుత్‌ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందని&period;&period;వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు&period; అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్‌ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు&period; అమెరికా- ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ను ఇరాన్‌ మూసివేసింది&period; దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి&period; ఈ క్రమంలోనే ట్రంప్‌ తాజా హెచ్చరికలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.