అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ..

Advertisements

<p>అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ఇప్పటికే భారీస్థాయిలో అమెరికా సైన్యం ఇరాన్‌ను చుట్టుముట్టింది&period; అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా పలు యుద్ధనౌకలను ఇరాన్‌ దిశగా తరలించింది&period; అయితే యుద్ధం ప్రారంభించకముందే అమెరికా సిబ్బంది తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది&period; విమాన వాహక నౌకలో విధులు నిర్వహిస్తోన్న 4500 సిబ్బంది &OpenCurlyQuote;టాయిలెట్‌’ కష్టాలను ఎదుర్కొంటున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>నివేదికల ప్రకారం&period;&period; ఎనిమిది నెలలుగా నడి సముద్రంలో ఉన్న యుద్ధనౌక లోని మురుగునీటి వ్యవస్థలో ఇటీవల వైఫల్యం తలెత్తింది&period; యుద్ధనౌక నిరంతరం కదులుతున్నందున&comma; సరైన నిర్వహణ లేకపోవడం వల్ల అందులో ఉన్న మొత్తం 650 మరుగుదొడ్లలో చాలా వరకు పనిచేయడం లేదు&period; దీంతో మహిళా సిబ్బందితో పాటు పురుషులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; బాత్రూంను ఉపయోగించుకోవాలంటే సిబ్బంది రోజు దాదాపు 45 నిమిషాల పాటు క్యూలో నిల్చోవాల్సి వస్తోంది&period; ఈ సమస్యను పరిష్కరించడానికి నౌకలోని సాంకేతిక నిపుణులు రోజుకు 19 గంటలు పనిచేస్తున్నా లాభం లేకుండా పోతోంది&period;<&sol;p>&NewLine;<p>అయితే టాయిలెట్‌ సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదని&period;&period; గతేడాది మార్చిలోనూ నాలుగు రోజుల్లో నౌకలోని 205 టాయిలెట్లు పాడయ్యాయని సిబ్బంది తెలిపారు&period; ఇందులో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ&period;&period; పెళుసుగా ఉండే వాక్యూమ్-ఆధారిత మురుగునీటి వ్యవస్థపై ఆధారపడడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు&period; ఇరుకైన మురుగు వ్యవస్థ నిర్మాణం కారణంగా ఒక వాల్వ్‌లో వైఫల్యం తలెత్తినా అన్ని టాయిలెట్లపై ఆ ప్రభావం పడుతోందన్నారు&period; ఈ పైపులను పునరుద్ధరించడానికి ప్రతిసారీ యాసిడ్ ఫ్లష్ చేయాల్సి వస్తోందన్నారు&period; దీని కోసం దాదాపు రూ&period;3 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు&period; అమెరికా ప్రభుత్వం తన కార్యక్రమాలను తరచూ పొడిగిస్తున్న కారణంగా కొంతమంది సిబ్బంది తీవ్ర అసహనానికి గురై సైన్యం వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది&period; ఇటీవల అమెరికా వెనెజువెలాపై దాడి చేసి&comma; మదురోను బంధించిన సమయంలోనూ ఈ నౌక నుంచే యుద్ధ విమానాలు దాడిలో పాల్గొన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.