అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు..

Advertisements

<p>ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు&comma; ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చన్న వదంతులు&comma; అలాగే టెహ్రాన్‌లో రెండో రోజు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు కలిసి పరిస్థితిని గందరగోళంగా మార్చాయి&period; ఈ నేపథ్యంలో భారత ఎంబసీ అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది&period; గతంలో ఇచ్చిన సూచనల కొనసాగింపుగా ఈ తాజా హెచ్చరిక విడుదలైంది&period; ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు&comma; ముఖ్యంగా విద్యార్థులు&comma; యాత్రికులు&comma; వ్యాపారులు&comma; టూరిస్టులు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించి వీలైనంత త్వరగా ఇరాన్ ను వదిలి వెళ్లాలని సూచించింది&period; ప్రదర్శనలు&comma; ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది&period; స్థానిక వార్తా మాధ్యమాలను గమనిస్తూ&comma; పరిస్థితులపై అప్డేట్స్ తెలుసుకోవాలని సూచించింది&period; పాస్‌పోర్ట్&comma; వీసా&comma; ఇతర గుర్తింపు కార్డులు ఎప్పుడూ సులభంగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది&period; అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లు కూడా వెల్లడించింది&period; మరోవైపు భారత ప్రభుత్వం ఇప్పటికే ఇరాన్‌కు నాన్-ఎసెన్షియల్ ట్రావెల్‌ను నిషేధించింది&period; ప్రస్తుతం అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర దశకు చేరుకున్నాయి&period; గత ఏడాది జూన్ 2025లో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత మళ్లీ ఇరాన్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది&period; ప్రధానంగా న్యూక్లియర్ డీల్ చర్చలే ఈ సంక్షోభానికి కేంద్రబిందువుగా మారాయి&period; జెనీవాలో ఓమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఇండైరెక్ట్ చర్చలు ఇంకా ఫలితం ఇవ్వలేదు&period; ఫిబ్రవరి 26à°¨ మూడో రౌండ్ చర్చలు జరగనున్నాయి&period; అమెరికా జీరో ఎన్‌రిచ్‌మెంట్&&num;8221&semi; అంటే ఇరాన్ యురేనియం ఎన్‌రిచ్ చేయకూడదని కోరుతోంది&period; ఇరాన్ ఈ డిమాండ్‌ను పూర్తిగా తిరస్కరించింది&period; ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 20à°¨ ఇరాన్‌కు 10–15 రోజుల గడువు ఇచ్చి&comma; డీల్ కుదరకపోతే నిజంగానే యుద్ధం జరుగుతుందని హెచ్చరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది&period; మధ్యప్రాచ్యంలో అమెరికా భారీ సైనిక సమీకరణ చేపట్టింది&period; రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ ఇప్పటికే మోహరించాయి&period; ఇరాన్ న్యూక్లియర్ సైట్లు&comma; బాలిస్టిక్ మిస్సైల్ కేంద్రాలు&comma; IRGC బేస్‌లపై దాడులకు సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు&period; ఇక ఇరాన్ కూడా యుద్ధానికి సై అంటోంది&period; సాటిలైట్ చిత్రాల ప్రకారం భూగర్భ బంకర్లు&comma; మిస్సైల్ కేంద్రాలను బలోపేతం చేస్తోంది&period; స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద రష్యాతో కలిసి నేవల్ ఎక్సర్‌సైజ్ నిర్వహించడం గ్లోబల్ ఆయిల్ సరఫరాపై ఒత్తిడి తీసుకురావడమేనని భావిస్తున్నారు&period; టెహ్రాన్‌లో విద్యార్థుల ఆందోళనలు రెండో రోజు కొనసాగుతుండటం దేశీయ ఒత్తిడిని పెంచుతోంది&period; ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు&period; మొత్తం పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది&period; చర్చలు విఫలమైతే సైనిక దాడులు&period;&period; ముఖ్యంగా న్యూక్లియర్&comma; మిస్సైల్ కేంద్రాలపై అమెరికా విరుచుకుపడే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.