హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisements

<p>హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లను పంపడంతో పాటు ప్రతిపాదిత మార్గాల్లో భూసేకరణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది&period; ఇందుకోసం 2 వేల 787 కోట్లు కేటాయించారు&period; 24 వేల 269 కోట్లతో రెండో దశ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; దీని విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు&comma; రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్&comma; ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌à°£‌గుట్ట&comma; మియాపూర్‌-à°ª‌టాన్‌చెరు&comma; ఎల్‌బీ à°¨‌గ‌ర్‌-à°¹‌à°¯‌త్ à°¨‌గ‌ర్ మొత్తం 76&period;4 కిలోమీటర్ల మేర విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్రం కేంద్రానికి పంపింది&period; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచ‌ర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేశారు&period;<br &sol;>&NewLine;హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు&comma; డీపీఆర్‌లను సైతం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు&period; రెండోదశ ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి&period; ఆర్‌జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ &comma; జేబీఎస్ నుంచి మేడ్చల్&comma; శామీర్‌పేట మొత్తం 86&period;1 కి&period;మీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 ప్రాజెక్టుకు మొత్తం 19 వేల 579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు&period; ఫేజ్ 2 ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం&comma; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు&period; రెండో దశ మెట్రో విస్తరణలో కిలో మీటరుకు నిర్మాణ అంచనా వ్యయం 318 కోట్లుగా ఉంది&period; పరిస్థితుల ప్రకారం ఇందులో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని డీపీఆర్‌లో పేర్కొన్నట్టు అధికారులు చెబుతున్నారు&period; కాగా ఎలివేటెడ్‌ మెట్రో&comma; డిజైన్‌&comma; ఇన్నోవేషన్‌తో హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో మెట్రో రెండో దశ పనులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది&period; హైదరాబాద్ మెట్రో రైలు రెండో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లకు భూసేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం&period; కేంద్రం నుంచి అనుమతులతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చే‌లోపు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయించింది&period; అందుకోసమే 2 వేల 787 కోట్లు కేటాయించింది&period; మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.