ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం..

atmalinga

Advertisements

&NewLine;<p>మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి&period; పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి&period; మిగతా రెండు వారణాశి&comma; రామేశ్వరం&period; గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం&comma; తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం&comma; ఉత్తరాన గంగావళినది&comma; దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి&period; ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది&period; పురాణ కథ ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ&comma; మహాభారతాలలో చూడగలం&period; ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది&period; పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా&comma; అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు&period; అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు&period; అందుకు ఓ నిబంధన విధించిన శివుడు&comma; రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు&period; ఆ నిబంధన ప్రకారం&comma; రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు&period; ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు&period; ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు&comma; తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి&comma; బ్రహ్మ&comma; విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా&comma; గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు&period; సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు&period; సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు&period; అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది&period;<br>అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు&comma; కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని&comma; తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు&period; అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు&comma; తాను మూడుసార్లు పిలుస్తానని&comma; అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు&period; వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు&period; అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు&comma; గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి&comma; ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు&period; రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది&period; ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు&period; ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది&period; ఆ నొక్కును ఇప్పటికీ&comma; ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు&period; ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ&comma; ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు&period; ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు&period; అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది&period; అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది&period; పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది&period; లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది&period; పెట్టెను కట్టిన &lpar;తాళ్ళు&rpar; పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది&period; ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది&period; ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు&period;<br>ఇంకొక కథనం ప్రకారం&comma; పాతాళలోకంలో తపస్సు చేసి&comma; భూలోకానికి వస్తున్నప్పుడు&comma; భూమాత గోరూపాన్ని ధరించిందట&period; ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో &lpar;ఆవు&rpar; కర్ణం &lpar;చెవి&rpar; &equals; గోకర్ణం అనే పేరు ఏర్పడిందట&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..