141
బాపట్ల ఏరియా ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న రిషిత అనే విద్యార్థిని గుండెపోటుతో చనిపోయారు. ఆమె స్వస్థలం విజయవాడ బాపట్ల ఏరియా ఆస్పత్రికి రిషిత మృతదేహాన్ని తరలించారు. హఠాత్తుగా గుండె పోటుకు గురై రిషిత మృతి చెందడంతో వసతి గృహ విద్యార్థినులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వందల సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని శోక సంద్రమయ్యారు.