143
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ౨౫ ఏళ్ల చిన్నబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా, ఇల్లు పూర్తిగా దెబ్బతింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.