Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home TelanganaKarimnagar కరీంనగర్ బస్సు యాత్రపై కీలక వ్యాఖ్యలు

కరీంనగర్ బస్సు యాత్రపై కీలక వ్యాఖ్యలు

by Rama
Gangula Kamalakar

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కరీంనగర్ బస్సు యాత్రపై కరీంగనర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని బలవంతంగా కరీంనగర్ తీసుకొచ్చారని.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియకుండానే ప్రచారానికి వచ్చారని సెటైర్ వేశారు. తమ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారం చేసిన ఘనత రాహుల్ గాంధీదేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా గంగుల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్లు దోచుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాదన వింతగా ఉందని మండిపడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: