ప్రజలను నిత్యం చైతన్యం చేస్తూ యువతకు మార్గదర్శకాలు సూచిస్తూ అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో పట్టణంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జూనియర్ కళాశాల మైదానంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన అనంతరం స్థానిక అంబేద్కర్ చౌక్, నేతన్న చౌక్, గాంధీ చౌక్ మీదుగా ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, డ్రగ్స్,గంజాయి మత్తు పదార్థాలకు బానిస అయిన వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక డ్రగ్స్ మేళ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, డ్రగ్స్ కు బానిస ఐనవారు వారు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ బారిన పడకుండా పోలీసులు అండగా ఉండి కాపాడతారని ఎస్పీ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.