ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం.

Advertisements

<p>పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు మారిపోతున్నాయి&period; ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది&period; అమెరికా యుద్ధవిమానాలు&comma; యుద్ధనౌకలు&comma; సైనిక స్థావరాల గురించి ఇరాన్‌కు రష్యా &OpenCurlyQuote;రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌’ సహకారం అందిస్తోందని తెలిపింది&period; పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి&period;&period;అమెరికా యుద్ధనౌకలు&comma; విమానాలు&comma; ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేసిందని వెల్లడించింది&period; రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్‌కు లభిస్తున్నాయని&comma; అందుకే ఇరాన్‌ దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు&period; ఇరాన్‌ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి&period; అందువల్ల రష్యా అందించే శాటిలైట్‌ చిత్రాలు వారికి ఉపయోగడుతున్నాయి&period; ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా&comma; తన నిఘా&comma; టార్గెటింగ్‌ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది&period; దాని ఫలితంగా ఇప్పుడు ఇరాన్‌ ప్రతీకార దాడులు చేయగలుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇరాన్&comma; చైనా&comma; ఉత్తర కొరియాలు రష్యాకు వివిధ రూపాల్లో సైనిక సహకారాన్ని అందించాయి&period; మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు&comma; ఇంటెలిజెన్స్‌ సహకారం అందించింది&period; ఉక్రెయిన్‌ నగరాలపై దాడికి రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్‌లను ఇరాన్‌ సరఫరా చేసింది&period; అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్‌కు ఇంటెలిజెన్స్‌ సహకారం అందిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.