తెలంగాణ సినిమా ప్రియులకు తీపి కబురు.

Advertisements

<p>తెలంగాణలోని సినిమా ప్రియులకు హైకోర్టు తీపికబురు అందించింది&period; ఇకపై థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే వారు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి అవసరం లేదంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది&period; ఫీజు వసూలుకు ఆస్కారం కలిగించే జీవో నెంబర్ 121ను హైకోర్టు కొట్టేసింది&period; సాధారణంగా మనం ఏదైనా మాల్స్&comma; మల్టీప్లెక్స్‌లకు వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే వారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది&period; అయితే 2021లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఈ నిబంధన నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది&period;దీంతో అక్కడ సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ప్రత్యేక పార్కింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చేది&period; ఇటీవల దిల్‍సుఖ్‍నగర్‍లోని కోణార్క్ థియేటర్‌లో ఓ ప్రేక్షకుడి నుంచి 20 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేశారు&period; దీనిపై ప్రేమ్ రామావత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు&period; దీనిపై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది&period; సినిమా టికెట్ కొంటే పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదని పేర్కొంది&period; ఈ తీర్పు కేవలం కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పరిమితం కాదని పేర్కొంది&period; తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని తెలిపింది&period; కోర్టు తాజా ఆదేశాలతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా మల్టీప్లెక్స్‌లు&comma; షాపింగ్ మాల్స్ నిబంధనల పరిధిలోకి వచ్చాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..