అమెరికా, కెనడాలో కొనసాగుతున్న పొగ మంచు తీవ్రత.

అమెరికా, కెనడాలో కొనసాగుతున్న పొగ మంచు తీవ్రత

Advertisements

<p>వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా&comma; కెనడాలో కార్చిచ్చులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి&period;కెనడాలో చెలరేగిన అడవి మంటల నుంచి వెలువడుతున్న పొగ అమెరికాలోని మిన్నెసోటా&comma; ఇల్లినోయీ&comma; మిషిగాన్&comma; డెట్రాయిట్‌తో పాటు పలు ప్రాంతాలకు వ్యాపించింది&period; అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరాన్ని కూడా దట్టమైన పొగ కమ్మేసింది&period;దీంతో పలు రాష్ట్రాల్లో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది&period; గుండె&comma; ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు&comma; వృద్ధులు&comma; చిన్నారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు&period; ప్రమాదకర పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు&period;<br &sol;>&NewLine;ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా అటవీ నిర్వహణలో లోపాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు&period; అవసరమైతే కెనడాపై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు&period;ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రభుత్వం అధికారికంగా స్పందించనప్పటికీ&comma; ఆంటారియో రాష్ట్ర నాయకుడు డగ్ ఫోర్డ్ మాత్రం గతంలో కార్చిచ్చుల సమయంలో అమెరికాకు కెనడా సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు&period; రాజకీయ విమర్శలు చేయడం కంటే పొరుగుదేశాలకు సహకరించడం మంచిదని వ్యాఖ్యానించారు&period;ప్రస్తుతం కెనడాలోని ఉత్తర ఆంటారియో ప్రాంతంలో దాదాపు 190 ప్రాంతాల్లో కార్చిచ్చులు కొనసాగుతున్నాయి&period; మంటలు వ్యాపిస్తున్న ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా&comma; మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.