జపాన్ ఓపెన్ టోర్ని విజేత పీవీ సింధు.

జపాన్ ఓపెన్ టోర్ని విజేత పీవీ సింధు

Advertisements

<p>ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న పెద్ద టైటిల్‌ ఎట్టకేలకు పీవీ సింధు చేతికి చేరింది&period; ఆతిథ్య దేశం అభిమానుల మధ్య&comma; నాలుగుసార్లు జపాన్‌ ఓపెన్‌ విజేత యమగుచిని ఆమె సొంతగడ్డపైనే ఓడించి భారత స్టార్‌ షట్లర్‌ ఘన విజయం సాధించింది&period; జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 టోర్నీలో తొలిసారి విజేతగా నిలవడమే కాదు&period;&period; ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది&period;<&sol;p>&NewLine;<p>టోక్యో మెట్రోపాలిటన్‌ జిమ్నేషియంలో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు 21-17&comma; 21-17తో యమగుచిపై ఆధిపత్యం చాటింది&period; తొలి గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడినా&period;&period; 17-17 సమయానికి సింధు దూకుడు ప్రదర్శించింది&period; వరుసగా నాలుగు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది&period; అదే మ్యాచ్‌కు కీలక మలుపుగా మారింది&period;<&sol;p>&NewLine;<p>రెండో గేమ్‌లో సింధు మరింత దూకుడుగా ఆడింది&period; ఆరంభంలోనే ఆధిక్యం సాధించి యమగుచిపై ఒత్తిడి పెంచింది&period; మధ్యలో జపాన్‌ స్టార్‌ పుంజుకుని స్కోరు 18-17కు తీసుకొచ్చినా&period;&period; కీలక సమయంలో సింధు ఏమాత్రం తడబడలేదు&period; వరుస పాయింట్లతో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది&period; స్వదేశీ అభిమానుల హర్షధ్వానాల మధ్య యమగుచిని నిలువరించడం సింధు విజయానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ఈ టైటిల్‌తో సింధు రెండేళ్ల తర్వాత BWF వరల్డ్‌ టూర్‌లో మళ్లీ ఛాంపియన్‌గా నిలిచింది&period; గతంలో 2024 డిసెంబరులో సయ్యద్‌ మోదీ టోర్నీ గెలిచిన తర్వాత ఆమెకు ఇదే తొలి వరల్డ్‌ టూర్‌ టైటిల్‌&period; అంతేకాదు&period;&period; సూపర్‌-750 లేదంటే అంతకంటే ఉన్నత స్థాయి టోర్నీల్లో ఏడేళ్ల తర్వాత మళ్లీ విజేతగా నిలిచి తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది&period;<&sol;p>&NewLine;<p>ఈ టైటిల్‌ సాధించే క్రమంలో సింధు అత్యున్నత స్థాయి ఆటను ప్రదర్శించింది&period; ప్రీక్వార్టర్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ను ఓడించింది&period; ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత చెన్‌ పై అద్భుత విజయం సాధించింది&period; ఫైనల్లో యమగుచిని మట్టికరిపించి జపాన్‌ ఓపెన్‌ ట్రోఫీని ముద్దాడింది&period; ఒకప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించిన సింధు&period;&period;మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంటోందనే సంకేతాలను ఈ టోర్నీ స్పష్టంగా చూపించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.