నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా అఖిలపక్ష భేటీ.

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా అఖిలపక్ష భేటీ

Advertisements

<p>పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది&period; కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశాన్ని నిర్వహించారు&period; సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు&period; అయితే తృణమూల్ కాంగ్రెస్ చెందిన రెబల్ ఎంపీల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి&period; ఇక&comma; ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి&comma; మిథున్‌ రెడ్డి హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలతో ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా కి సమావేశానికి ఆహ్వానం ఇవ్వడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీలు సమావేశం నుంచి ప్రతీకాత్మకంగా వాక్‌ అవుట్ చేశాయి&period; కొద్దిసేపటి తర్వాత మళ్లీ సమావేశానికి హాజరయ్యాయి&period; టీఎంసీకి చెందిన సుమారు 20 మంది తిరుగుబాటు ఎంపీలు జూన్‌లో ఎన్‌సీపీఐలో విలీనం అయినట్లు ప్రకటించారు&period; అయితే ఆ విలీనాన్ని లోక్‌సభ స్పీకర్ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు&period; అయినప్పటికీ ఎన్‌సీపీఐని అఖిలపక్ష సమావేశానికి పిలవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి&period; టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ&period;&period; పార్లమెంట్ వెబ్‌సైట్‌లో కూడా పేరు లేని&comma; అధికారిక గుర్తింపు లేని పార్టీని ఎలా సమావేశానికి పిలుస్తారు&quest; అని ప్రశ్నించారు&period; మరోవైపు&period;&period; ఎన్‌సీపీఐ పార్లమెంటరీ పక్ష నాయకురాలు కాకోలి ఘోష్ దస్తిదార్ మాత్రం తమకు సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు&period; స్పీకర్‌కు అవసరమైన పత్రాలన్నీ సమర్పిస్తామని&comma; విలీనానికి సంబంధించిన నిర్ణయం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>ఇదిలా ఉండగా&period;&period; అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు పలు కీలక అంశాలను ప్రస్తావించాయి&period; అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారం&comma; నీట్ పేపర్ లీక్&comma; వ్యవసాయ సమస్యలు&comma; పెట్రోల్‌లో ఈ20 ఇంధన మిశ్రమం&comma; అలాగే నియోజకవర్గాల పునర్విభజన &lpar;డిలిమిటేషన్&rpar; వంటి అంశాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశాయి&period; దీంతో&comma; వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి రాజుకుంది&period; ఎన్‌సీపీఐకి ఇచ్చిన గుర్తింపుపై మొదలైన వివాదం&period;&period; పార్లమెంట్ సమావేశాల్లోనూ అధికార–విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.