చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్.

చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్

Advertisements

<p>తిరుపతి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; చంద్రగిరి నియోజకవర్గం&comma; రామచంద్రాపురం మండలంలో నెన్నూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు సిద్దముని రెడ్డి&comma; గిరిధర్ రెడ్డి&period;&period; అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది&period;<&sol;p>&NewLine;<p>తిరుపతి జిల్లాలో వైసీపీ నుంచి పార్టీలో చేరిన సిద్దముని రెడ్డి&comma; గిరిధర్ రెడ్డి సహా అనుచరులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు&period; 40 ఏళ్లకు పైగా ఒకే పార్టీలో ఉన్న సిద్దముని రెడ్డి కుటుంబం టీడీపీలో చేరడం శుభపరిణామమని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు&period; టీడీపీపై విశ్వాసంతో పార్టీలోకి వచ్చిన సిద్దముని రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు&period; అందరూ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు&period;2024 ఎన్నికల తర్వాత పలువురు నాయకులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపారని&comma;అయితే పార్టీలో చేరికల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు&period;నాధముని రెడ్డి&comma;గిరిధర్ రెడ్డి కుటుంబాలు పార్టీలో చేరతాయని ఊహించని మంచి పరిణామమన్నారు&period; వారి చేరిక పార్టీ బలోపేతానికి మరింత ఊతమిస్తోందన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబం పార్టీలోకి రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్&comma; తిరుపతి టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీ రెడ్డి కొనియాడారు&period; 80 ఏళ్లు దాటిన వయస్సులోనూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న కుటుంబానికి తాను అండగా నిలిచి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు&period;సీనియర్ నేతల చేరికతో చంద్రగిరి నియోజకవర్గం లో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.