సినీ నటి జాత్వని కేసులో సీఐడి ట్విస్ట్.

సినీ నటి జాత్వని కేసులో సీఐడి ట్విస్ట్

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌తో ఓ ఊహించని మలుపు చోటుచేసుకుంది&period; ఈ కేసులో సీఐడీ జరిపిన లోతైన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి&period; వైఎస్సార్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను నటి కాదంబరి జెత్వాని బ్లాక్‌మెయిల్ చేసినట్లు సీఐడీ తన చార్జ్‌షీట్‌లో అధికారికంగా పేర్కొంది&period; సీఐడీ చార్జ్‌షీట్ ప్రకారం&period;&period; కుక్కల విద్యాసాగర్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలకు సంబంధించిన ఫొటోలను చూపించి కాదంబరి జెత్వాని ఆయనను బెదిరింపులకు గురిచేసింది&period; ఈ ఫొటోలను బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేసి&comma; విద్యాసాగర్ నుంచి ఆమె రూ&period; 1&period;32 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ స్పష్టం చేసింది&period; ఈ బ్లాక్‌మెయిలింగ్&comma; డబ్బు వసూళ్లకు సంబంధించిన పక్కా ఆధారాలను కూడా సీఐడీ తన చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది&period; గతంలో ఈ కేసు రాజకీయంగా&comma; పరిపాలనాపరంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే&period; జెత్వాని ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా&comma; ఈ కేసులో విచారణ సరిగా జరపలేదనే ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది&period; అయితే&comma; ఇప్పుడు సీఐడీ సమర్పించిన చార్జ్‌షీట్‌లో విద్యాసాగర్‌ను జెత్వాని బ్లాక్‌మెయిల్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలతో పేర్కొనడంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది&period; ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.