కొనసాగుతున్న ఉభయ సభల వాయిదాల పర్వం.

Advertisements

<p>నీట్‌ పేపర్‌ లీకేజి పై పార్లమెంట్‌ ఉభయ సభలు అట్టుడుకాయి&period; గురువారం ఉదయం సభలు ప్రారంభం అవ్వడమే అలస్యం విపక్షలు సభను అడ్డుకోవడంతో సభలు వాయిదాల పర్వం నాలుగవ రోజు కూడా కొనసాగుతుంది&period; పేపర్‌ లీకేజీలు పై కేంద్రం వివరణ&comma;&&num;8230&semi; కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా&comma;&&num;8230&semi; విద్యార్థులకు క్షేమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఉభయ సభలను ప్రతిపక్షాలు అడ్డకుకోవడంతో వరుసగా నాలుగవ రోజు కూడా సభలు వాయిదా పడ్డాయి&period;<&sol;p>&NewLine;<p>అనేక కీలక అంశాల పై చర్చించేందుకు ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు అడుగు కూడా ముందుకు సాగడం లేదు&period; పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ చర్చలకు విపక్షలు ససేమీరా అంటున్నాయి&period; ముఖ్యంగా నీట్‌ పేపర్‌ లీకేజి విషయంలో పార్లమెంట్‌ సమావేశాలు అగ్గి రాజేసింది&period; పేపర్‌ లీకేజికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్షలు పట్టుపట్టాయి&period; ఇప్పటికే మూడు రోజుల పాటు ఇదే అంశంలో ఉభయ సభలు వాయిదా పడగా నాలుగవ రోజు కూడా పరిస్థితలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం&period; ఓ వైపు ఎన్డీఏ పక్షాలు మరోవైపు యూపీఏ పక్షాలు కూడా సభలో అందోళనలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకుంది&period; సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పక్ష పార్టీలు అందోళన చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి&period; చివరకు సభ నిర్వహణలో ఏలాంటి మార్పు రాకపోవడంతో సభాపతులు శుక్రవారంకు సభను వాయిదా వేశారు&period; సభలు వాయిదా పడిన తరువాత కూడా విపక్షలు పార్లమెంట్‌ ఎదుట ప్లేకార్డులతో అందోళన చేపట్టాయి&period; పేపర్‌ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని లేదంటే కేంద్ర ప్రభుత్వమే అయను బర్తరఫ్‌ చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.