అమెరికా కీలక ప్రకటన చేసింది.

Advertisements

<p>ఇరాన్‌తో యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని&comma; అయినప్పటికీ ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా కీలక ప్రకటన చేసింది&period; ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది&period; ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధమని వెల్లడించింది&period; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది&period;అణ్వాయుధాల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ మొండిగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది&period; అణ్వాయుధాల తయారీని కొనసాగిస్తూ వచ్చిందని తెలిపింది&period; ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తమ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయలేదని పేర్కొంది&period; అంతేకాకుండా అమెరికా&comma; ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ చేతిలో చావు తప్పదని హెచ్చరిక చేశారని తెలిపింది&period; కానీ ఇప్పుడు ఈ యుద్ధంలో ఖమేనీయే హతమయ్యారని ఆ ప్రకటనలో వెల్లడించింది&period;యుద్ధం ఇరుపక్షాలకు నష్టం చేకూరుస్తుందని అమెరికా రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది&period; తాము యుద్ధానికి సిద్ధమైంది ఇరాన్‌లో పాలన మార్చాలనే ఉద్దేశంతో కాదని&comma; కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే దాడులు చేశామని తెలిపింది&period; అణు స్థావరాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది&period;<br &sol;>&NewLine;ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఖమేనీ హత్యపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఇప్పటికే ఖమేనీ ప్రోద్బలంతో తనపై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయని వెల్లడించారు&period; అతడు నన్ను పట్టుకోకముందే నేనే అతడ్ని పట్టుకున్నానని వ్యాఖ్యానించారు&period; ఇరాన్‌ తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు&period; &OpenCurlyQuote;ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని వెల్లడించారు&period; కాగా ఇరాన్ పై జరిగిన దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారన్నారు&period; అంతా సవ్యంగానే జరుగుతోందన్నారు&period; ఈ దాడులు ఇప్పుడు ప్రారంభించకుంటే రెండు వారాల్లోనే అణ్వాయుధాలను ఇరాన్ సంపాదించి ఉండేదని ట్రంప్ గుర్తుచేశారు&period; చమురు ధరలపై ఆందోళన అవసరం లేదని ట్రంప్ తెలిపారు&period; అంతా మంచే జరుగుతుంది&period; ఆందళన చెందొద్దు అని ట్రంప్ హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>ఇరాన్ పై దాడుల కోసం అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోకపోవడం అమెరికాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది&period; డెమోక్రాట్లతో పాటు సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు కూడా ట్రంప్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు&period; ఇది రాజ్యాంగ విరుద్ధమని&comma; చట్టవిరుద్ధ యుద్ధమని ఆరోపిస్తున్నారు&period; ఇది అమెరికా కాంగ్రెస్‌పై జరిగిన దాడి అని అభివర్ణించారు&period; ఎలాంటి తక్షణ ముప్పు లేనప్పుడు అధ్యక్షుడు చట్టవిరుద్ధంగా యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు&period; గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ కాంగ్రెస్‌తో సంప్రదించే నిర్ణయం తీసుకున్నారని కాలిఫోర్నియా డెమోక్రాట్ ప్రతినిధి రో ఖన్నా తీవ్రంగా విమర్శించారు&period; కెంటకీ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీ&comma; సెనేటర్ రాండ్ పాల్ వంటి కూడా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పారన్నారు&period;&period; యుద్ధం ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని&comma; ఇది &&num;8216&semi;అమెరికా ఫస్ట్&&num;8217&semi; విధానం కాదని వారు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా భగ్గుమంది&period; ఇరాన్‌లో పాలన మార్పు లక్ష్యంగా ఆ దేశంపై భారీ సైనిక దాడులకు ట్రంప్ ఆదేశించారు&period; ఫిబ్రవరి 28à°¨ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు&period; ఈ పరిణామంతో ఆగ్రహించిన ఇరాన్ తక్షణమే ప్రతీకార దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది&period; ఇరాన్ దాడుల్లో ఇప్పటికే ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు&period; దీనంతటికీ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయాల ఫలితమేనన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా ఓటింగ్ జరపాలని&comma; ఇందుకోసం కాంగ్రెస్‌ను తక్షణమే సమావేశపరచాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు&period; ఈ వారం మధ్యలో దీనిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది&period; అయితే&comma; స్పీకర్ మైక్ జాన్సన్&comma; సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ వంటి రిపబ్లికన్ అగ్ర నాయకులు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు&period; అధ్యక్షుడికి రాజ్యాంగబద్ధంగా ఈ అధికారం ఉందని వాదిస్తున్నారు&period; మరోవైపు&comma; ఇరాన్ తన ప్రతీకార దాడులను ఇజ్రాయెల్&comma; గల్ఫ్ దేశాలపై విస్తరిస్తుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.