ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌..

Advertisements

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి&period; ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి అమెరికా&comma; ఇజ్రాయెల్‌&period; ఈ దాడుల్లో కీలక సైనికాధికారులు ఇద్దరు మరణించారు&period; ఇరాన్‌ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ&comma; బసీజ్‌ మిలీషియా అధిపతి&period;&period;జనరల్‌ గులాం రెజా సాల్మనీ మృతి చెందారు&period; యుద్ధం తొలిరోజున సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్‌కు ఇంత భారీ స్థాయిలో నష్టం జరగడం మళ్లీ ఇదే మొదటిసారి&period; ఇరాన్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబం నుంచి లారిజానీ వచ్చారు&period; పార్లమెంటు మాజీ స్పీకర్‌గా&comma; విధాన నిర్ణయ సలహాదారుగా&comma; అణు వ్యవహారాల్లో ఖమేనీకి సలహాదారుగా పనిచేశారు&period; ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శిగా సేవలందించారు&period; బసీజ్‌ దళానికి అధిపతిగా ఉన్న సాల్మనీ&period;&period; ఇటీవల ఇరాన్‌లో జరిగిన అల్లర్లను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు&period; 1965లో జన్మించిన ఆయనపై అమెరికా&comma; ఐరోపా కూటమి ఆంక్షలు విధించాయి&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ఇరాన్&comma; లెబనాన్‌ రాజధానులు టెహ్రాన్&comma; బీరుట్‌లు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి&period; ఉత్తర టెహ్రాన్‌లోని సాదాబాద్‌ ప్యాలెస్‌ ప్రాంతంతోపాటు మధ్య టెహ్రాన్&comma; కరాజ్&comma; షహర్యార్&comma; షిరాజ్‌ నగరాలపై దాడులు జరిగాయి&period; ఇరాన్‌లోని కమాండ్&comma; క్షిపణి ప్రయోగ కేంద్రాలు&comma; గగనతల రక్షణ వ్యవస్థలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది&period; లెబనాన్‌లోని కఫార్‌లో జరిగిన దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు&period; ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా లెబనాన్‌లో 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు&period;<&sol;p>&NewLine;<p>ఇటు గల్ఫ్‌తోపాటు ఇజ్రాయెల్‌పైనా ఇరాన్‌ దాడులను కొనసాగిస్తోంది&period; యూఏఈలోని ఫజైరా చమురు క్షేత్రంపై ఇరాన్‌ మళ్లీ డ్రోన్‌ దాడి చేసింది&period; అక్కడ ఉన్న చమురు నౌకపై ఈ దాడి జరిగింది&period; ఇరాన్‌ నుంచి డ్రోన్&comma; క్షిపణి దాడుల భయంతో&period;&period;కొద్దిసేపు యూఏఈ తన గగనతలాన్ని మూసివేసింది&period; ఆ తర్వాత విమానాలు యథావిధిగా తిరిగాయి&period; బనీ యాస్‌ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ పాకిస్థాన్‌ జాతీయుడు మరణించారు&period; 10 క్షిపణులు&comma; 45 డ్రోన్లను ఇరాన్‌ ప్రయోగించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.