ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది.

Advertisements

<p>ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది&period; ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ‍ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి&period; వారిలో అత్యధిక మంది టెహ్రాన్‌కు చెందిన ‍ప్రజలే&period; అయితే ఈ యుద్దం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు&period; తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌ నగరంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకపడింది&period; ఈ దాడిలో 15 మందికి పైగా మృతిచెందారు&period;<&sol;p>&NewLine;<p>ఇస్ఫాహాన్‌ నగరంలో రిఫ్రిజిరేటర్లు&comma; హీటర్లు తయారుచేసే ఓ ఫ్యాక్టరీపై ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ పత్రికా కథనాలు పేర్కొన్నాయి&period; ఆ సమయంలో అందులో కార్మికులు విధులు నిర్వహిస్తుండడంతో పెద్దఎత్తున మరణాలు సంభవించాయని తెలిపాయి&period; అయితే ఇటీవల ఖర్గే ద్వీపంపై అమెరికా దాడి చేసిన తర్వాతే ఈ క్షిపణి అటాక్ జరిగింది&period; అయితే దీనికి ఘాటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది&period;<&sol;p>&NewLine;<p>అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పట్లో సద్ధుమణిగేలా కనిపించడం లేదు&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే ఇరాన్ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేశామని ప్రకటించారు&period; ఇరాన్ సైతం ఎక్కడా తగ్గట్లేదు&period; గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది&period;అయితే ట్రంప్ ఇటీవలే హార్మూజ్‌ జలసంధిలో చమురు రవాణాకు రక్షణ కల్పించే విధంగా వివిధ దేశాలు తమ యుద్ధ నౌకలు అక్కడికి పంపించాలని కోరారు&period; అయితే ఇరాన్ సైతం ఎక్కడా తగ్గడం లేదు&period; తమ అనుమతి లేకుండా ఈ జలసంధి గుండా ప్రయాణిస్తే వాణిజ్య నౌకలు పేల్చివేస్తామని హెచ్చరించింది&period; ఈ నేపథ్యంలో యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.